తైవాన్ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20వ నేషనల్ కాంగ్రెస్లో జిన్పింగ్ మాట్లాడారు. శాంతియుత మర్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకుంటున్నామని, అదే సమయంలో బలప్రయోగం ఉండదని హామీ ఇవ్వబోనని తేల్చి చెప్పారు. 2035 నాటికి ఆర్థిక, సైనిక శక్తిలో చైనాను సూపర్ పవర్గా తీర్చిదిద్దటమే తమ లక్ష్మమని పేర్కొన్నారు. చైనాను అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధితో ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు. ప్రపంచంపై ఆధిపత్య పోరాటానికి సిద్దమని పరోక్షంగా సంకేతాలిచ్చారు. అమెరికాలో వాణిజ్య యుద్ధం, తైవాన్ను అమెరికా మద్దతు నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు.