పాకిస్థాన్ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆరు స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. ప్రధాని షెహబాజ్ ఫరీఫ్ కూటమి పార్టీకి ఇమ్రాన్ షాకిచ్చారు. పెషావర్, మార్దాన్, చార్సద్దా, ఫైసలాబాద్, నాన్కనా సాహిబ్ స్థానాలను ఇమ్రాన్ పార్టీ గెలుచుకున్నది. నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలతో పాటు పంజాబ్ అసెంబ్లీలోనూ రెండు స్థానాలను ఇమ్రాన్ పార్టీ కైవసం చేసుకున్నది. పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఆరు స్థానాలు గెలిచినా.. ముల్తాన్, కరాచీ స్థానాలను మాత్రం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సొంతం చేసుకున్నది. ఉప ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్కు చెందిన పార్టీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నది. షేక్పురా సీటును ఆ పార్టీకి చెందిన ఇఫ్తికర్ అహ్మద్ భంగో తన ఖాతాలో వేసుకున్నది.