ప్రవాస భారతీయుడు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు ఆఫ్ డైరెక్టర్ జనార్థన్ నిమ్మలపూడి (జానీ) 5895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి తానా లోగోను ప్రదర్శించారు. మధుమేహం, భుజం ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతూనే 50 ఏళ్ల వయసులో యాత్రను దిగ్విజయంగా ముగించారు. కిలిమంజారో అధిరోహించేందుకు ఆయన రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర సాగింది. తనతో పాటు సినీ నిర్మాత రామ్ తాళ్లూరితో కూడిన అయిదుగురి బృందం సాహసయాత్రలో పాల్గొందని వివరించారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో ఎంతో కష్టతరమైన పర్వతారోహణను దిగ్విజయంగా పూర్తి చేయగలిగారంటూ తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరితో పాటు పలువురు అభనందించారు.