Namaste NRI

 స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌ ఫ్రస్టేషన్‌ సాంగ్‌ రిలీజ్‌

సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం స్లమ్‌ డాగ్‌ హెజ్జెండ్‌. ప్రణవి మానుకొండ హీరోయిన్‌గా నటిస్తోంది.  దర్శకుడు పూరి జగన్నాథ్‌ శిష్యుడు డాక్టర్‌ ఏఆర్‌ శ్రీధర్‌ ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మైక్‌ మూవీస్‌పై అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఇట్‌ ఈజ్‌ ఫ్రస్టేషన్‌ సాంగ్‌ అనే పాటని దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి భీమ్స్‌ సిసిరోలియో పాడారు.  ఈ సాంగ్‌లో నటుడు సునీల్‌ తళక్కున మెరిశారు. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. షూటింగ్‌ తుది దశలో ఉంది అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఛమ్మక్‌ చంద్ర, గుండు సుదర్శన్‌, ఫిష్‌ వెంకట్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ వైష్ణవ్‌ వాసు, సినిమాటోగ్రఫీ : శ్రీనివాస్‌ జె రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సాహిత్యం కాసర్ల శ్యామ్‌. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : రమేష్‌ కైగురి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events