రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా కాంతారా. సప్తమి గౌడ నాయికగా నటించింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ చిత్రం కన్నడ వెర్షన్లో సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న విడుదలైంది. భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సందర్భంగా హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుదన్నారు. ఇది పాన్ ఇండియా మూవీ అనుకుని చేయలేదు. సినిమాలోని సత్తానే దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇవాళ తెలుగు, కన్నడ సినిమాలు ప్రాంతీయ హద్దులు దాటి ఇండియన్ సినిమా ఎదిగాయి అని అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ మంచి చిత్రాలకు భాషా భేదాలు లేవని ఈ చిత్ర విజయంతో మరోసారి నిరూపితం అన్నారు. ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)