దేశీయంగా మైనారిటీలు, అణగారిన వర్గాల మానవహక్కులను పరిరక్షించినప్పుడే అంతర్జాతీయంగా భారత్ మాటలకు విలువ పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ముంబై లో 26/11 పేలుళ్ల మృతులకు నివాళులర్పించారు. ఐఐటీ`ముంబై విద్యార్థులతో మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరు అంతర్జాతీయ ప్రాధాన్యాంశంగా మారాలని అన్నారు. ప్రతి దేశం దానిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మైనారిటీలు, సహా మావనహక్కులు, కార్యకర్తలు, విద్యార్థులు, విద్యావేత్తలు, పాత్రికేయుల హక్కులకు గొడుగుపట్టాలని సూచించారు. పర్యావరణ సంక్షోభం భారత్‌తో సహా ప్రతి దేశానికి గొడ్డలిపెట్టుగా మారింది. భారత ఆర్థిక, వ్యవసాయ, ఆహార, వైద్యరంగాలపై పెను ప్రభావం చూపుతోంది. పునరుత్పాదక సాంకేతికతలకు ప్రాధాన్యత పెంచాలి అని సూచించారు.