కీర్తిశేషులు సుధాకర్ కాట్రగడ్డ పేరుమీద వాలీబాల్ అండ్ త్రో బాల్ టోర్నమెంట్ తానా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరిగింది. స్పార్క్ ఎరెనా (SPARC Arena), నోవి(Novi)లో తానా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు క్రీడాకారుల నుంచి విశేషమైన స్పందన లభించింది. 37 టీంలు, 500 మంది ప్లేయర్‌లతో స్టేడియం కళ కళ లాడింది. మిషిగన్ అటార్ని జనరల్ డేనా నెసేల్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా తానా చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. నిస్వార్థ సేవా దృక్పథానికి, స్నేహశీలతకు, మంచితనానికి మారుపేరు సుధాకర్ కాట్రగడ్డ అని అన్నారు. వారు తానాకు చేసిన సేవలు ఎంతో విలువైనవి అని కొనియాడారు. ఎన్నో సేవలతో అశేషమైన తానా సభ్యుల అభిమానాన్ని పొందిన మహోన్నత వ్యక్తి సుధాకర్ అని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా వారి పేరు మీద వాలీబాల్ అండ్ త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన విరాళాలు తానా అన్నపూర్ణ ప్రాజెక్టు( ప్రభుత్వ హాస్పిటల్‌లలో ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమం) కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.