రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. డబుల్ ఇంపాక్ట్ ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాస్ క్రాకర్ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. నేను మీలో విలన్‌ను చూస్తే మీరు నాలో హీరోని చూస్తారు. కానీ, నేను రవితేజ ఇంగ్లీష్‌లో చెప్పిన డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాంది. ఈ సినిమాలో ఆయన రెండు కోణాలున్న పాత్రలో సందడి చేయనున్నారు. రవితేజ శైలి మాస్ అంశాలతో టీజర్ అద్యంతం ఆసక్తికరంగా సాగింది. అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళి అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. రొమాంచితమైన పోరాట ఘట్టాలుంటాయి అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కార్తిక్ ఘట్టమనేని, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, దర్శకత్వం : త్రినాథ రావు నక్కిన. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్ 23న విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)