పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జాతీయ అసెంబీ సభ్యత్వంపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అర్హత ఖాన్‌కు లేదని, రానున్న ఐదేళ్లలో అతను ఏ ఎన్నికలోనూ పోటీ చేయకూడదని పేర్కొంది. ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రతినిధులు ఇచ్చిన బహుమానాలను అమ్మకున్నారన్నది ఇమ్రాన్‌పై అభియోగం. ఈ ఆరోపణలు నిరూపితమయ్యాయని, ఎన్నికల ప్రమాణ పత్రంలోనూ ఇందుకు సంబందించిన వివరాలు లేవని ఎన్నికల సంఘం పేర్కొంది. జాతీయ అసెంబ్లీలో ఎనిమిది సీట్లకు గానూ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ఆరు స్థానాలను కైవసం చేసుకున్న రెండు రోజులకే ఎన్నికల సంఘం తీర్పు వెలువరించడం గమనార్హం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)