బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి వీరసింహారెడ్డి అనే టైటిల్ ఖరారు చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ అన్నది ఉప శీర్షిక. ఈ చిత్ర టైటిల్ లోగోను కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద విడుదల చేశారు. ప్రచార చిత్రంలో బాలకృష్ణ నెరసిన జుట్టుతో నల్లచొక్కా.. పంచె ధరించి మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే నిర్మాతలకు రూ.140 కోట్ల వరకు వచ్చాయని టాక్.