అమెరికాలో సమాధులు తవ్వ పనిలో నిమగ్రమయ్యే ఓ వ్యక్తికి జాక్‌పాట్ వరించింది. నార్త్ కరోలినాలోని లింకన్‌టన్‌లో నివసించే లూథర్ డౌడీ స్థానికంగా గ్రేవ్ యార్డ్‌లో సమాధులు తవ్వే పని చేస్తుంటాడు. ఆయన బాగా ఆభిమానించే ప్రొఫెషనల్ డ్రైవర్ డేల్ ఎర్న్‌హార్డ్ రేసింగ్ కారు నంబర్ 3. ఇదే నంబర్‌పై ఆతడు ఇటీవల పందెం కాచాడు. మరుసటి రోజే అతడు రూ.2 కోట్ల జాక్‌పాట్ సొంతం చేసుకున్నాడు. లాటరీ ఆడిన తొలిసారే ఇలా లక్షాధికారి అవుతానని అనుకోలేదంటున్నాడు లూథర్. ఇంత భారీ మొత్తంలో లాటరీ గెలుచుకుంటానని అస్సలు ఊహించలేదంటున్నాడాయన. తన అభిమాన డ్రైవర్ కారు నంబర్‌తో పాటు మరో రెండు నంబర్లను ఎంచుకున్నాడు. క్విక్ పిక్‌లో లాటరీలో ఇదే నంబర్‌కు జాక్‌పాట్ వచ్చిందని తెలియడంతో లూథర్ డౌడీ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ లాటరీ సొమ్ముతో రుణం తీర్చుతానని, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న తన పొరుగింటి వ్యక్తిని ఆదుకుంటానని చెప్తున్నారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో ఇక చేసే పనికి వీడ్కోలు పలికి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడట లూథర్ డౌడీ.