చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) సమావేశాలు ముగిసాయి. సమావేశాల ముగింపు సందర్భంగా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రసంగించారు. ధైర్యంగా పోరాటం చేయాలని, ధైర్యంగా గెలవాలని, తలలు వంచి కష్టపడాలని, నమ్మకంతో ముందుకు సాగాలని జీ జిన్‌పింగ్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సమావేశాల అనంతరం 200 మంది సీనియర్ పార్టీ నేతలతో కొత్త సెంట్రల్ కమిటీని ఎంపిక చేశారు. జిన్‌పింగ్ పనితీరును మెచ్చుకుంటూ ప్రతినిధులు ఓటేశారు. కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. పార్టీ జనరల్ సెక్రటరీగా జీ జిన్‌పింగ్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మళ్లీ ఆయన్నే జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తే, అప్పుడు జీ జిన్‌పింగ్ మూడవసారి అధ్యక్ష పదవికి పోటీపడేందుకు లైన్ క్లియర్ అవుతుంది. సుమారు 2300 మంది పార్టీ నేతలు సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే మూడవ సారి దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు కావాల్సిన మార్పుల్ని చేస్తూ జిన్‌పింగ్ చేసిన తీర్మానానికి ఆమోదముద్ర పడినట్లు తెలుస్తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)