Namaste NRI

యశోద ట్రైలర్ డేట్ ఫిక్స్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ’యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి, హరీష్ కలిసి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్‌ 27న సాయంత్రం 5.36 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో రావు రమేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.  ఈ మూవీలో ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న యశోదను శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events