సమంత టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం యశోద. హరి`హరీష దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. టీజర్‌లో సమంతను గర్భవతిగా చూపించారు. డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన సరోగెట్ మదర్‌గా సమంత కనిపించింది. నీకు ఎప్పుడైనా రెండు గుండెల చప్పుళ్లు వినిపించాయా? బిడ్డకు, కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది అని సమంత చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. క్రైమ్, రాజకీయంపై మహిళ చేసే పోరాటం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతున్నది. న్యూఏజ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించామని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. నవంబర్ 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్, సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా॥చల్లా భాగ్యలక్ష్మి.
