ఒకే ఒక్క పాత్రతో రూపొందించిన చిత్రం హలో మీరా. కాకర్ల శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ బాగుంది. ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను థ్రిల్ చేసే సినిమా తీయడం ఒక సవాల్. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది అన్నారు. పెళ్లి చేసుకోవాల్సిన మీరా రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకొని కారులో హైదరాబాద్ బయల్దేరుతుంది. ఆ తర్వాత మీరా పరిస్థితి ఎలా మారింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)