విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా రష్యా చేస్తున్న దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. పుతిన్ విద్యుత్తు ఉగ్రవాదాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. యుద్దంలో తమను ఓడిరచలేక ఇలాంటి ప్రతికూల చర్యలకు మాస్కో పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లోనే దేశంలో మూడవ వంతు పవర్ స్టేషన్లను రష్యా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని జెలెన్‌స్కీ వెల్లడిరచారు. విద్యుత్తు కేంద్రాలను టార్గెట్ చేయడం వల్ల ఆచితూచి విద్యుత్తును వాడాలని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజల్ని కోరింది. ఫ్రంట్‌లైన్‌లో రష్యా దళాలు ముందుకు కదలలేకపోతున్నాయని, అందుకే ఆ దళాలు ఎనర్జీ కేంద్రాలను టార్గెట్ చేస్తున్నారని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఎనర్జీ టెర్రరిజానికి పాల్పడుతున్న రష్యా ఆది ఆ దేశ బలహీనతను చూపిస్తోందని అన్నారు. యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్‌ను రష్యా ఓడిరచలేదని, అందుకే మన ప్రజల్ని ఇలా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా 45 లక్షల మంది ప్రజలు చీకట్లలో మగ్గుతున్నారని తెలిపారు. ఒక్క రాజధాని కీవ్‌లోని 4 లక్షల 50 వేల అపార్టుమెంట్లకు విద్యుత్తు లేదని మేయర్ విటాలి క్లిశ్చెంకో పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)