రణధీర్, నందినీ జంటగా ఎం. వినయ్ బాబు తెరకెక్కించిన చిత్రం సీతారామపురంలో ఒక ప్రేమ జంట. శ్రీధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది. బోలెడన్ని మలుపులతో చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో అంతర్లీనంగా ఓ మంచి సందేశం ఉంది. యువతతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమిది అన్నారు. మంచి కథతో పాటు చక్కటి వాణిజ్య అంశాలు ఉన్న సినిమా ఇది. దీన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు చిత్ర దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది అన్నారు. భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబరు 18న విడుదల కానుంది.