అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ట్రంప్ ముగ్గురు సలహాదారులు కూడా నిజమని నిర్దారిస్తున్నారు. అమెరికాలో వచ్చేవారం మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొన్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ మనదేశాన్ని బలీయమైన శక్తిగా, సురక్షితంగా, విజయమంతమైన దేశంగా మార్చేందుకు నేను బహుశా మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఏడాది మనం మళ్లీ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్నాం. సెనేట్‌గా గెలవబోతున్నాం. 2024 ఎన్నికల్లో అమెరికాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అందుకు అందరూ సిద్ధంగా ఉండండి అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)