అంతర్జాతీయస్థాయిలో భారత్ ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే నైపుణ్యం భారతీయులకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో భారత్ కచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 150 కోట్ల మంది ప్రజలతో భారత్ సమర్థవంతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. గత వారం కూడా ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ గొప్ప దేశ భక్తుడని కితాబిచ్చారు. మోదీ స్వతంత్ర విదేశాంగ విధానంతో భారత్ ఎంతో సాధించిందని చెప్పారు. భవిష్యత్తు భారత్ దే అని వ్యాఖ్యానించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)