Namaste NRI

ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్‌

దుబాయ్‌లో నివాసముండే ప్రవాస భారతీయుడు ఎన్ఎస్ సాజేష్‌కు జాక్‌పాట్ తగిలింది. ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్  తగిలింది. దాంతో ఏకంగా  25 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో అక్షరాల రూ. 55కోట్ల 77లక్షలు.  ఇటీవల సాజేష్ కొనుగోలు చేసిన సిరీస్ నం. 245కు ఈ గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఉద్యోగిగా  చేస్తున్న సాజేష్ ఈసారి 20 మంది తోటి ఉద్యోగులతో కలిసి ఈ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ టికెటే వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో ఏకంగా రూ. 55.77కోట్లు గెలుచుకున్నారు. ఇంత భారీ ప్రైజ్‌మనీ గెలుచుకోవడం ఆనందంగా ఉందని, ఈ నగదును తాము 21 మంది సమానంగా పంచుకుంటామని సాజేష్ తెలిపాడు.  అలాగే తాను పనిచేసే హోటల్‌లో సుమారు 150 మంది వరకు ఉద్యోగులు ఉన్నారని, వారిలో అవసరం ఉన్నవారికి తన వాటా నుంచి ఎంతో కొంత సాయం చేస్తానని సాజేష్ చెప్పుకొచ్చాడు. ఇకపై కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల బిగ్ టికెట్ లాటరీలో పాల్గొంటానని అన్నాడు.   గత నాలుగేళ్ల నుంచి ప్రతి నెల సాజేష్ ఇలా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events