అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన సిక్కు మహిళ డాక్టర్ జస్మీత్ కౌర్ బెయిన్స్ చరిత్ర సృష్టించారు. బేకర్స్‌ఫీల్డ్‌కు చెందిన జస్మీత్ కౌర్ కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి సిక్కు మహిళగా ఆమె రికార్డుకెక్కారు. కెర్న్ కౌంటీలోని 35వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ నుంచి బరిలోకి దిగిన జస్మీత్ కౌర్ తన ప్రత్యర్థి లెటిసియా పెరెజ్‌పై విజయం సాధించారు. జస్మీత్ కౌర్‌కు 10,827 ఓట్లు వస్తే, పెరెజ్‌కు 7,555 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఆమె బేకర్స్‌ఫీల్డ్ రికవరీ సర్వీసెస్‌లో మెడికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జస్మీత్ కౌర్ పేరెంట్స్ కొన్నేళ్ల క్రితం ఇండియా నుంచి అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.