భారత వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డా. పూర్ణిమాదేవి బర్మన్ను ఈ ఏడాది ఐరాస ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణ వ్యవస్థ క్షీణతను నిరోధించడానికి కృషి చేస్తున్న వారికి ఇది ఐరాస ఇచ్చే అత్యుత్తమ గౌరవ పురస్కారం. అస్సాంకు చెందిన పూర్ణిమాదేవి అవిఫౌనా రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ డివిజన్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నారు. 10 వేల మంది మహిళలతో ఆమె నిర్వహిస్తున్న హర్గిలా ఆర్మీ గ్రేటర్ ఎడ్జుటెంట్ స్టార్క్ అనే ప్రత్యేక కొంగల జాతి అంతరించిపోకుండా వాటి సంరక్షణకు కృషి చేస్తోంది. ఈ అవార్డును బర్మన్, యూకేకు చెందిన సర్ పార్థాదాస్ గుప్తా, పెరూ, లెబనాన్, కామెరూన్ దేశాల ఉద్యమకారులకు ఐరాస ప్రకటించింది.