మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్‌లోకి ప్రత్యేక అతిథి విచ్చేశారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు. అధికారికంగా విడుదల కానున్న బాస్ పార్టీ పాటను చూసిన పవన్ కల్యాణ్ ఆనందించారు. దర్శకుడు కొల్లి బాబ్బీ ఈ మెగా మూవెంట్‌పై గొప్ప సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప క్షణం అని అన్నారు. అన్నదమ్ముల ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు హరి హర వీరమల్లు నిర్మాత ఎ.ఎమ్. రత్నం, దర్శకులు క్రిష్. బాబీ.