Namaste NRI

చంద్రముఖిగా… కంగనా రనౌత్ 

 రజనీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార ప్రధాన పాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో 2005లో వచ్చిన చంద్రముఖి ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా చంద్రముఖి 2 నుంచి  తెరకెక్కిస్తున్నారు పి.వాసు.  అయితే  లీడ్ రోల్ను రాఘవా లారెన్స్ చేస్తున్నారు.  కాగా అప్పటి చంద్రముఖి లో జ్యోతిక చేసిన చంద్రముఖి పాత్రకు సీక్వెల్లో కంగనాను తీసుకున్నారని తెలిసింది. నృత్యాల్లో చక్కటి ప్రవేశం ఉండటంతో ఆమెను ఈ సినిమాకు ఎంపిక చేశారని, రాజనర్తకిగా కంగనారనౌత్ పాత్ర చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుందని తెలిపారు.  దర్శకులు పి. వాసుగారితో వర్క్ చేయనుండటం హ్యాపీగా ఉంది అని పేర్కొన్నారు కంగనా రనౌత్. డిసెంబరు తొలి వారంలో చెన్నైలో జరగనున్న చంద్రముఖి 2 చిత్రీకరణలో కంగనా పాల్గొంటారని టాక్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events