అరుణ్ విజయ్ కథానాయకుడిగా జి. ఎన్.ఆర్ కుమారవేలన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆక్రోశం. పల్లక్ లల్వాని కథానాయిక. సీహెచ్ సతీస్ కుమార్‌తో కలిసి ఆర్ విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ప్రతీకారం నేథ్యంలో యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుగా రూపొందిన చిత్రమిది. తమిళంలో సినం పేరుతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి విభిన్నమైన కథల్ని తప్పక ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఆర్‌ఎస్‌ఆర్, మనోహర్, కెఎస్‌జి వెంకటేష్ తదితరులు నటిస్తున్నారు.
