భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో భారత్, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. భారత్, అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం యుధ్ అభ్యాస్ 18వ ఎడిషన్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో జరుగుతున్నది. భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ లేఖ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు రెండు వారాలు కొనసాగనున్నాయి. శాంతి పరిరక్షణ, విపత్తు సహాయక చర్యల్లో ఇరు దేశ సైన్యాల మధ్య పరస్పర సహకారం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేందుకు సంయుక్త ఆర్మీ డ్రిల్ జరుగుతున్నది. కాగా, ఎల్‌ఏసీ సమీపంలో భారత్, అమెరికా సైనికుల సంయుక్త విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 1993, 1996లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.
