Namaste NRI

అమెరికాలో  చరిత్ర సృష్టించిన యువకుడు.. 18ఏళ్లకే

అగ్రరాజ్యం అమెరికాలో 18ఏళ్ల యువకుడు చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని ఆర్కన్సాస్‌కు చెందిన జైలెన్ స్మిత్ ఎర్లే  అనే చిన్న నగరానికి జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయభేరీ మోగించాడు. జైలెన్ స్మిత్ తన ప్రత్యర్థి అయిన నేమీ మ్యాథ్యూస్‌ను 185 ఓట్ల తేడాతో ఓడించి ఎర్లే నగర మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఈ క్రమంలోనే అమెరికాలో మేయర్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

2020 జనాభా లెక్కల ప్రకారం ఎర్లే నగరంలో 1,831 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇకపోతే జైలెన్ స్మిత్ ఏర్లే హైస్కూల్‌లో ఈ ఏడాది మేలోనే గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఎన్నికల్లో గెలవడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన అతడు ఎర్లేలో నూతన అధ్యాయం ప్రారంభించడానికి ఇది సరైన సమయం అన్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress