వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యరావ్, అయేషాఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ముఖచిత్రం. విశ్వక్‌సేన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. గంగాధర్ దర్శకుడు, ఎస్‌కేఎన్ సమర్పణలో ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ ఓ కొత్త పాయింట్‌ను ఈ సినిమాలో చర్చించాం. ఇప్పటి వరకు రానటువంటి వినూత్నమైన కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు. మంచి కథకు ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు బృందం తోడయిందని, అన్ని విభాగాల్లో సినిమా అద్భుతంగా కుదిరిందని ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ కలర్‌ఫొటో చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న సందీప్ మరోసారి జాతీయ అవార్డు సాధిస్తాడని అన్నారు. అంత మంచి కథ అన్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌ను చిన్న ఆర్టిస్టులతో గొప్పగా రూపొందించారన్నారు. ప్రియా వడ్లమాని, రెండు క్యారెక్టర్లలో బాగా నటించిందన్నారు. అయేషా, వికాస్ ఇతర నటీనటులు కూడా బాగా నటించారన్నారు. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో నిర్మాత సందీప్ రాజ్, హీరోయిన్ ప్రియా వడ్లమాని, హీరోయిన్ అయేషా, హీరో వికాస్ వశిష్ట, శైలేష్ కొలను, అర్జే స్వరూప్ నిర్మాత బన్నీవాసు తదితరులు పాల్గొన్నారు.
