ఓ పైనాపిల్ ధర ఎంత ఉంటుంది. రూ.50 లేదా రూ.100. మహా అయితే రూ.150 వరకు ఉండొచ్చు. అయితే ఇంగ్లాండ్ కార్న్‌వాల్‌లో దొరికే పైనాఫిల్ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అక్కడ దొరికే హెలిగాన్ పైనాఫిల్ ధర మాత్రం అక్షరాల లక్ష ( వెయ్యి పౌండ్స్) రూపాయలంట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పైనాపిల్ ఇదే నట. ఒక్కో పండు లక్షకు అమ్ముతున్నా దీనిని కొనుగోలు చేసేందుకు మాత్రం స్థానికులు పోటీపడుతుండటం విశేషం. దీనిని పండిరచేందుకు సుమారు మూడేళ్లు పడుతుందట. కూలీలు కూడా ఎక్కువ మంది అవసరం ఉండటం. వాతావరణ పరిస్థితులు వంటి కారణాలతో ఈ పండు పండిరచేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో పండు లక్షకు అమ్మినా గిట్టుబాటు కావడం లేదట మరి. .ప్రస్తుతం ఒక్కో పైనాఫిల్ను రూ. లక్షకు విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేలం పెడితే రూ.10 లక్షల వరకు ధర పలకొచ్చని పేర్కొన్నారు.