భారత్ అగ్రరాజ్యం అమెరికాకి మిత్రపక్షంగా ఉండబోదంటూ వైట్‌హౌస్ ఉన్నతాధికారి కర్ట్ క్యాంపెబెల్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆస్సెన్ సెక్యూరిటీ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భారత్ గురించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు విశిష్ట వ్యూహాత్మక స్వభావాన్ని కలిగి ఉన్న భారత్, అమెరికాకు మిత్రపక్షంగా ఉండదని, ఒక గొప్ప శక్తిగా ఉంటుందని అన్నారు. గత 20ఏళ్లలో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాల బలోపేతంగా వేగంగా ఏర్పడ్డాయని అన్నారు. అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధం అని కూడా తెలిపారు.
