గణేష్ బెల్లంకొండ హీరోగా నటిస్తున్న చిత్రం నేను స్టూడెంట్ సార్. అవంతిక దసాని నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాంది సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. రాకేష్ ఉప్పలపాటి దర్శకుడు. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తాజాగా ఈ చిత్రంలోని మాయే మాయే లిరికల్ పాటను దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించిన ఈ పాటను మహతి స్వరసాగర్ స్వరపర్చి కపిల్ కపిలన్‌తో కలిసి పాడారు. సినిమాలో ప్రేమ గీతంగా ఈ పాట ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)