చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర ( బాబీ కొల్లి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం వాల్తేరు వీరయ్య. శ్రుతీహాసన్ కథానాయిక. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరో రవితేజ కీలక పాత్ర చేశారు. ఆయన చేసిన ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్, టీజర్‌ని విడుదల చేశారు. ఏం రా వారీ పిస పిస చేస్తుండావ్.. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవ్వనయ్యకీయినని అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో టీజర్ సాగుతుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆర్థర్ ఎ. విల్సన్. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.