Namaste NRI

చెడ్డి గ్యాంగ్‌ తమాషా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన బ్రహ్మానందం 

వెంకట్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం చెడ్డీగ్యాంగ్‌ తమాసా.   గాయత్రి పటేల్‌  కథానాయిక. సి. హెచ్‌. క్రాంతికిరణ్‌ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.  ప్రముఖ నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడ్డీ గ్యాంగ్‌ తమాషా అంటే ఇందులో హాస్యం ఉంటుందని అర్థమైంది. అందుకే ఓహాస్యనటుడిగా ట్రైలర్‌ విడుదల కోసం వచ్చా అన్నారు.  సినిమా బాగుంటే అదే  విజయం సాధిస్తుంది. మంచి బృందం కలిసి చేసిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్ముతున్నా అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ  పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో పరిశ్రమకి వచ్చా. ఓ పల్లెలో భూస్వామి ఆ ఊరి జనాల్ని పట్టి పీడిస్తుంటాడు. గొప్ప ఆదర్శ భావాలున్న ఓ వ్యక్తి ఆ పల్లెని ఎలా కాపాడాడనే అంశంతో ఓ కామెడీ డ్రామాగా మలిచాం. అందరూ నచ్చేలా ఉంటుంది  చిత్రం అన్నారు.  ఈ కార్యక్రమంలో సంజయ్‌ నాయక్‌, మాస్టర్‌ .జి. విహారి తదితరులు పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress