దసరా నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ తుదిదశకు చేరుకుంది. క్లైమాక్స్ ఘట్టాల చిత్రీకరణ గోదావరిఖని బొగ్గుగని సెట్‌లో ప్రారంభమైంది. పదిహేను రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌సాంగ్ ధూమ్ ధామ్ కు మంచి స్పందన లభించింది అని చిత్ర బృందం పేర్కొంది. కీర్తి సురేష్, సముద్రఖని సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, దర్శకత్వం శ్రీకాంత్ ఓదెల.