అమెరికాలోని ఇడావోకు చెందిన బోయల్ స్ట్రాసర్ అనే వ్యక్తి తన గడ్డాన్ని అపురూపంగా పెంచుకుంటున్నాడు. న్యితం ఎంతో అందంగా అలంకరించుకుంటాడు. గడ్డం ఆరోగ్యం కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటారు. ఇలా ప్రేమగా పెంచకోబట్టే ఆ గడ్డం ఆయనకు ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తెచ్చి పెట్టింది. గత మూడేండ్లుగా వరుసగా గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధిస్తున్న జోయల్ స్ట్రాసర్ తాజాగా 710 బబుల్స్‌తో తన రికార్డును మరోసారి బద్దలు కొట్టాడు. తొలిసారి 2019 లో 302 బబుల్స్‌తో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన స్ట్రాసర్ మరుసటి ఏడాది 542 బబుల్స్‌తో 2021 లో 686 బబుల్స్‌లో తన రికార్డులను తానే బద్దలు కొట్టాడు. క్రిస్మస్ వేళ తన గడ్డాన్ని క్రిస్మస్ చెట్టుకు అలంకరించే వస్తువులతో అందంగా తీర్చిదిద్ది నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)