Namaste NRI

తానా డాలస్ ఫుడ్ డ్రైవ్ -సతీష్ కొమ్మన  ఆధ్వర్యంలో కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన  “తానా DFW team” ఆధ్వర్యంలో   పేదల సహాయార్ధం  ‘ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్’ మరియు ‘నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్’ కు “తానా డాలస్ ఫుడ్ డ్రైవ్” కార్యక్రమంలో 9000 మందికి పైగా ఒక్కరోజుకి సరిపడే వివిధ రకాల పలు ఆహార ధాన్యాలు, క్యాన్డ్ ఫుడ్ మరియు నిత్యవసర సరుకులు అందజేశారు.

మనకు జీవనోపాధి, ఎదుగుదలకు ఎన్నో సదుపాయాలు కల్పించిన అమెరికా కు మనం ఎంతో ఋణపడి వున్నాం అని, ఇక్కడ నివసిస్తున్న పేదవారికి, తిరిగి మనవంతు తోడ్పాటు అందించాలనే సదుద్దేశంతో తానా “ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్”, “నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్” వారికి గత కొన్ని సంవత్సరాలుగా ‘తానా’ సహాయ సహకారాలను అందిస్తుంది అని తెలియజేశారు.‘తానా’ ప్రవాసంలో వున్న తెలుగువారితో పాటు అమెరికా సమాజంతో మమేకమై ఇక్కడ పేదరికంలో వున్న వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పడానికి చాలా ఆనందంగా వుందన్నారు.

పేదల సహాయార్ధం ఫుడ్ డ్రైవ్ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్స్ గా డా. ప్రసాద్ నల్లూరి, శేషగిరి గోరంట్ల తమ ఉదారతను చాటుకున్నారు, వీరితో పాటు  విరాళాలు అందించిన దాతలు అందరికీ మరియు ఫుడ్ డ్రైవ్ చేపట్టడానికి సహకరించిన “ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్”, “నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్” వారికి, ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events