ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల అమెరికా తెలుగు సంఘం నాట్స్ స్పందించింది. చలపతిరావు మరణం వార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు సినిమాల్లో విలనిజంతో పాటు కామెడీ పండించడంలో కూడా చలపతిరావుది విలక్షణమైన శైలి అని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. 1200 పైగా తెలుగు చిత్రాల్లో నటించి ఏ పాత్ర వేసినా అందరి చేత శభాష్ అనిపించుకున్న చలపతిరావు మరణం తమను కలిచివేసింది అని నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి అన్నారు. చలపతిరావు కుటుంబానికి నాట్స్ నాయకులు, సభ్యులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)