అగ్రరాజ్యం అమెరికా లో భారత సంతతి వ్యక్తి మైకి హోతి చరిత్ర సృష్టించాడు. కాలిఫోర్నియాలోని నగరానికి తొలి భారత సంతతి వ్యక్తి మేయర్‌గా ఎన్నికయ్యాడు. కాలిఫోర్నియా లోని లోది నగరానికి మేయర్‌గా సేవలు అందించిన మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం ఇటీవల పూర్తైంది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు మేయర్ ఎన్నిక కోసం భేటీ అవ్వగా, భారత సంతతి కి చెందిన మైకి హోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ద్వారా వెల్లడించారు. లోది నగర మేయర్‌గా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. గతంలో డిప్యూటీ మేయర్‌గా సేవలు అందించారు. ఈ క్రమంలోనే ఆ నగరానికి మేయర్‌గా ఎన్నికైన తొలి సిక్కు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)