పాకిస్తాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా భయపడుతున్నది. పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అక్కడి తమ పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. రెండ్రోజుల క్రితం ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి అనంతరం కొందరు వ్యక్తులు మరో ఉగ్రదాడికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందిందని అమెరికా హెచ్చిరించింది. మరీ ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన మారియట్ హోటల్‌ను వెంటనే ఖాళీ చేయాలని తమ పౌరులకు సూచనలు జారీ చేసింది. ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌పైనే రెండ్రోజుల క్రితం ఉగ్రదాడి జరిగింది. సెలవు దినాల్లో పాక్‌లోని ఏ హోటల్‌కు వెళ్లవద్దని అమెరికా తన పౌరులను ఆదేశించింది.