చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. జీరో కొవిడ్ విధానానికి స్వస్తి పలికేందుకు సిద్ధమైంది. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. ఇప్పటి వరకు విదేశీ ప్రయాణికులకు 5 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా అమలు చేస్తున్న చైనా ప్రభుత్వం, ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధన జనవరి 8 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నెగిటివ్ ధ్రువపత్రం చూపిస్తే చాలని పేర్కొంది. 48 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.