తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎస్ 5, నో ఎగ్జిట్. ఈ చిత్రాన్ని ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శ్యామ్యూల్, షేక్ రహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. భరత్ కోమలపాటి (సన్నీ) దర్శకుడు. ఈ సందర్భంగా భరత్ కోమలపాటి మాట్లాడుతూ సినిమా ప్రథమార్థం హారర్ థ్రిల్లర్‌గా సాగుతూనే ప్రీ క్లెమాక్స్ వచ్చేసరికి సస్పెన్స్, పొలిటికల్ డ్రామాగా టర్న్ తీసుకుంటుంది. తారకరత్న సుబ్బు పాత్రలో కనిపిస్తారు. రాజకీయ నేతగా సాయి కుమార్ నటన మెప్పిస్తుంది అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ఒక ట్రైన్‌లో ఒక కోచ్ మొత్తం మంటలు అంటుకుంటాయి. ఆ ఒక్క బోగికే ఎందుకు అగ్నిప్రమాదం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథనం ఊహకి అందదు. ఇందులో పొలిటికల్ డ్రామా కూడా ఉంది. సినిమా ప్రారంభానికి ముందు యానిమేటెడ్ సాంగ్‌లో కథను పరిచయం చేశాక సినిమా మొదలవుతుంది అని తెలిపారు. నిర్మాత గౌతమ్ కొండెపూడి మాట్లాడుతూనా ఫ్రెండ్ భరత్ ఒకరోజు ఈ స్టోరి వినిపించాడు. కథ నచ్చి వెంటనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాం. పేరున్న ఆర్టిస్టులతో కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నారు. దాదాపు 200 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)