చైనాతోపాటు మరి కొన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. చైనాతోపాటు మరో ఐదు ఆసియా దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు కరోనా నెగటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరి చేయనున్నది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమాన ప్రయాణికులు ఆర్టీ-పీసీర్ నెగటివ్ రిపోర్ట్‌ను విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను వచ్చే వారం నుంచి అమలు చేసే అవకాశమున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.