అమెరికాలో తానా, ఇతర సంఘాల అధ్వర్యంలో అయ్యప్ప దీక్షలు చేపట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఏటామాదిరిగానే ఈ ఏడాది కూడా కొంతమంది అయ్యప్ప భక్తులు దీక్ష చేపట్టారు. భక్తిశ్రద్ధలతో ప్రతి రోజూ భజన కార్యక్రమాలు చేస్తున్నారు. అమెరికాలోని మార్యాల్యాండ్ శివ, విష్ణు ఆలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు చేపట్టారు. భజన కార్యక్రమానికి మాలధారణ స్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా హాజరయ్యారు. మరోవైపు దీక్ష పూర్తయిన కొంత మంది స్వాములు స్థానిక శివ, విష్ణు ఆలయంలోనే దీక్ష విరమిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ప్రత్యేక విమానంలో కేరళ రాష్ట్రానికి చేరుకుని అక్కడ నుంచి శబరిమలై అయ్యప్ప సన్నిధికి వెళ్లి దీక్ష విరమణ చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)