అశ్విన్ బాబు, పాలక్ లల్వాని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం వచ్చినవాడు గౌతం. ఎం.ఆర్. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డి.ఎస్.రావు నిర్మాత. ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ క్లాప్ నిచ్చారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్, ఎ.ఎస్. రవికుమార్, వి.సముద్ర, రాజా రవీంద్ర తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ చాలా రోజుల విరామం తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. దర్శకుడు ఎం.ఆర్. కృష్ణ చెప్పిన మెడికో థ్రిల్లర్ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నారు. రెండు షెడ్యూల్స్లోనే చిత్రీకరణను ముగించి, సినిమాను మేలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నాజర్, అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంధ్యా జనక్, మాధవి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : హరి గౌర, కెమెరా: శ్యామ్ కె. నాయుడు సహ నిర్మాతలు: చందు వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రమేష్ తోట, గిరిధర్.