ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు టీడీపీ ఎన్నారై విభాగం ముందుకొచ్చింది. టీడీపీ ఎన్నారై సెల్ నాయకులు కోమటి జయరాం ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే అన్ని విధాలుగా సాయపడేందుకు టీడీపీ ఎన్నారై విభాగం సిద్ధంగా ఉందని తెలిపారు.