Namaste NRI

మొదలైన న్యూ ఇయర్​ సంబురాలు

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో 2023 నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు పటాకుల మోతతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఆకాశాన్ని రంగులమయం చేశారు. ఈ కొత్త ఏడాది ప్రజా జీవితాలను సంతోషంగా, సంబురంగా ఉంచాలని కోరుకుంటూ,  భవిష్యత్తును రెండు చేతులు చాచి స్వాగతించారు చాలామంది.  

న్యూజిలాండ్​లోని ఆక్లాండ్ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.  ఆ తర్వాత పటాకుల మోతతో రాత్రివేళ ఆకాశంలో తారాజువ్వలు సందడి నెలకొంది. ది ల్యాండ్ డౌన్ అండర్ గా పేరొందిన ఆస్ట్రేలియాలో  కూడా పటాకుల మోతమోగింది. ఆకాశం దద్దరిల్లేలా పటాకుల మోత, లైటింగ్​ ప్రదర్శనతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. సిడ్నీ ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్‌పై పటాకుల వెలుగులు విరజిమ్మడంతో ప్రేక్షకులు సిడ్నీ హార్బర్ చుట్టూ ఉన్న వాన్టేజ్ పాయింట్‌లను సందర్శించారు. ఇక  భారతదేశం, యూఎస్, యూకే, అనేక ఇతర దేశాలలో ప్రజలు ఇప్పటికే కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు.

అయితే, కరోనా మహమ్మారి గత రెండు సంవత్సరాలుగా న్యూ ఇయర్​ వేడుకలు జరుపుకోకుండా చేసింది. కానీ, ఈసారి ప్రజలు 2023 కోసం మరింత ఆశావాదంతో ఎదురు చూసి, సంబరాలను గట్టిగానే జరిపారు. బిగ్గరగా అరుస్తూ.. ఆనందోత్సాహాలతో నూతన సంవత్సరం 2023ని స్వాగతించారు.

Social Share Spread Message

Latest News