ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే రెండు టూరిస్ట్ హెలికాప్టర్‌లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గోల్డ్ కోస్ట్‌లోని సీ వరల్డ్ థీమ్ పార్క్ సమీపంలో గల మెయిన్ బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు క్వీన్‌ల్యాండ్స్ గోల్డ్ తీరానికి వచ్చి సేద తీరుతుంటారు. ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా, మరో హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న సమయంలో రెండూ ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్టు క్వీన్‌లాండ్స్ ఇన్‌స్పెక్టర్ ఓరెల్ పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)