టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ సినిమా కరోనాకు ముందే ప్రారంభమైంది. కానీ పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. గతకొన్ని నెలలుగా ఈ మూవీ నుండి ఎలాంటి అప్‌డేట్‌లు రాకపోవడంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఆ వార్తలకు చెక్ పెట్టారు. రొమ్ కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ పోస్టర్‌లో నాగశౌర్య, మాళవికా నాయర్ బస్‌లో ఒకరిపై ఒకరు వాలిపోయి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వింటూ కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ సగ భాగం ఇండియాలో, మరో సగ భాగం అమెరికాలో సాగనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానందా వంటి క్లాసికల్ లవ్‌స్టోరీల తర్వాత నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబోలో సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.