Namaste NRI

టెక్సాస్ జ‌డ్జిగా భార‌త సంత‌తిరాలు ప్ర‌మాణ స్వీకారం

డెమోక్ర‌టిక్ నేత, భారతీయ అమెరిక‌న్‌  జూ ఏ మాథ్య‌  టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జ‌డ్జిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కేరళలోని తిరువల్లకు చెందిన మాథ్యూ కాసర్‌గోడ్‌లోని భీమనడి నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రమాణం స్వీకారం చేశారు. నాలుగేళ్ల పాటు ఆమె కౌంటీ జ‌డ్జిగా చేస్తారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ నేత ఆండ్రూపై మాథ్యూ 123,116 ఓట్ల తేడాతో గెలుపొందారు.  15 ఏళ్లుగా ఆమె న్యాయ‌వృత్తిలో ఉన్నారు. టార్చ‌ర్‌, సివిల్ లిటిగేష‌న్‌, క్రిమిన‌ల్ మేట‌ర్స్ లాంటి అంశాల్లో ఆమె కేసుల వాదిస్తుంటారు. జువెనైల్ ఇంట‌ర్వెన్ష‌న్‌, మెంట‌ల్ హెల్త్ కోర్టుకు అధిప‌తిగా ఆమె కొన‌సాగుతున్నారు. ఫిలడెల్ఫియాలో మాథ్యూ పెరిగింది. పెన్ స్టేట్ యూనివ‌ర్సిటీకి ఆమె హాజ‌రైంది. దెలావ‌ర్ లా స్కూల్ నుంచి ఆమె డాక్ట‌రేట్ పొందారు.  ఈ సందర్భంగా   జూలీ మాట్లాడుతూ  ఈ ప్రయాణంలో తనకు మద్ధతుగా నిలిచిన వారికి, ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.  2018లో రిపబ్లికన్‌ ట్రిసియా క్రెనెక్‌ను 8.24 శాతం ఓట్లతో ఓడించి.ఒక యూఎస్‌ బెంచ్‌కు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్‌ మహిళగా జూలి ఏ.మాథ్యూ చరిత్ర సృష్టించారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events