మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా రూపొందిస్తున్న పౌరాణిక ప్రణయగాథ శాకుంతలం. దర్శకుడు గుణశేఖర్. సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. శకుంతల, దుష్యంతుడి ప్రణయం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దుష్యంతుడిగా దేవ్‌మోహన్ నటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించేందుకు త్రీడీలో రూపొందిస్తున్నామని చిత్రబృందం తెలిపింది. మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్, మధుబాల, గౌతమి తదితరులు నటిస్తున్నారు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్, సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)